ఆ కోపంతోనే 'ఫాస్టెస్ట్' సెంచ‌రీ.. రెచ్చిపోయిన 'స‌న్‌రైజ‌ర్స్' స్టార్ బ్యాట్స్‌మెన్‌

2023 ప్రపంచకప్‌కు జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు

Update: 2023-08-23 04:55 GMT

2023 ప్రపంచకప్‌కు జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపంతోనే ది హండ్రెడ్ లీగ్‌లో తుఫాను సెంచరీ కొట్టాడు. నిన్న జ‌రిగిన‌ హండ్రెడ్ లీగ్ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. బ్రూక్ ఇన్నింగ్సు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అయితే జట్టు విజ‌యానికి మాత్రం పనికిరాలేదు.

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్ లీగ్‌'లో వెల్ష్ ఫైర్ జ‌ట్టుపై నార్తర్న్ సూపర్‌చార్జర్స్ కు చెందిన హ్యారీ బ్రూక్ చారిత్రాత్మక సెంచరీని సాధించాడు. బ్రూక్ 42 బంతుల్లో 105 పరుగులతో అజేయ ఇన్నింగ్సు ఆడాడు. ఈ క్రమంలో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. ఈ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ స్ట్రైక్ రేట్ 250. అయితే.. హ్యారీ బ్రూక్ త‌ప్ప‌ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టులోని ఏ ఇతర బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు.

హండ్రెడ్ లీగ్ లో హ్యారీ బ్రూక్ వేగవంతమైన సెంచరీ సాధించాడు. అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంత‌కుముందు విల్ జాక్వెస్, విల్ స్మీజ్ ఈ లీగ్‌లో సెంచరీలు చేశారు. హ్యారీ బ్రూక్ పాకిస్థాన్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో కూడా సెంచరీలు సాధించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ సూపర్‌చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. బ‌దులుగా వెల్ష్ ఫైర్ జట్టు 90 బంతుల్లో మ్యాచ్‌ను ముగించి నార్తర్న్ సూపర్‌చార్జర్‌ను ఓడించింది. వెల్ష్ తరఫున స్టీఫెన్ ఎస్కిన్‌జిబ్ 28 బంతుల్లో 58 పరుగులు, జానీ బెయిర్‌స్టో 39 బంతుల్లో 44 పరుగులు, జో క్లార్క్ 22 బంతుల్లో 42 పరుగులతో తుఫాను ఇన్నింగ్సులు ఆడారు.


Tags:    

Similar News