బ్లాక్ లో అమ్మితే అరెస్ట్ చేసుకోవచ్చు
టిక్కెట్ల విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని హెచ్‌సీఏ ఛైర్మన్ అజారుద్దీన్ తెలిపారు.
టిక్కెట్ల విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని హెచ్‌సీఏ ఛైర్మన్ అజారుద్దీన్ తెలిపారు. టిక్కెట్ల విక్రయాలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెప్పారు. పేటీఎం ద్వారానే టిక్కెట్లు విక్రయించడానికి ఏర్పాటు చేసినట్లు అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణ పోలీసులు తమపై కేసులు పెడితే తాము పేటీఎంపై కేసులు పెడతామని ఆయన తెలిపారు. తొక్కిసలాట ఘటనలో తమ తప్పుంటే అరెస్ట్ చేయాలని అజారుద్దీన్ కోరారు.
బాధాకరమే అయినా...
నిన్న జరిగిన తొక్కిసలాటకు హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని అజారుద్దీన్ తెలిారు. బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్ల అమ్మకాలు అవాస్తవమని ఆయన తెలిపారు. బ్లాక్ టిక్కెట్లు ఎవరు అమ్మినా చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఆ అధికారం పోలీసులకు ఉందని చెప్పారు. నిన్నటి ఘటనలో బాధితులందరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరుపున వైద్యం అందిస్తామని ఆయన చెప్పారు. తాము ఈనెల 25వ తేదీన జరిగే మ్యాచ్ ఏర్పాట్లలో ఉన్నామని ఆయన తెలిపారు. టిక్కెట్ల గందరగోళంపై హెచ్‌సీఏ కూడా కమిటీని నియమించి విచారిస్తుందని ఆయన తెలిపారు.