సంచలన నిర్ణయం తీసుకున్న సాక్షి మాలిక్

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్

Update: 2023-12-21 13:05 GMT

Sakshi Malik announces retirement 

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడు. ఎన్నికల్లో అతనికి పోటీగా నిలిచిన కామ‌న్‌వెల్త్ స్వర్ణ విజేత అనితా షియోరాన్ ఓటమిపాలయ్యారు. మొత్తం 47 ఓట్లలో సంజ‌య్ సింగ్‌కు 40 ఓట్లు పోల‌య్యాయి. త‌మ‌ను లైంగికంగా వేధించాడని మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోపించిన బ్రిజ్ భూష‌ణ్ అనుచరుడే రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

2016 రియో ​​ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికైన తర్వాత రెజ్లింగ్‌ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. తాను రెజ్లింగ్ క్రీడ‌ను వ‌దిలేస్తున్న‌ట్లు చెప్పారు. బ్రిజ్ భూష‌ణ్ కు వ్యతిరేకంగా 40 రోజుల‌ పాటు రోడ్ల‌పై ధ‌ర్నా చేప‌ట్టామ‌ని, ఆ సమయంలో త‌మ‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని తెలిపారు. ఎన్నికల్లో బ్రిజ్ భూష‌ణ్ బిజినెస్ అనుచరుడు విజ‌యం సాధించార‌ని.. అందుకే తాను రెజ్లింగ్ క్రీడ‌ను వదిలేస్తున్న‌ట్లు సాక్షీ మాలిక్ వెల్ల‌డించారు. "మేము 40 రోజులు రోడ్లపై పడుకున్నాము. దేశంలోని అనేక ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు మాకు మద్దతుగా వచ్చారు. బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యాపార భాగస్వామి సన్నిహితుడు WFI అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అందుకే, నేను రెజ్లింగ్‌ను విడిచిపెట్టాను" అని ఆమె చెప్పుకొచ్చారు. టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పునియాతో కలిసి మీడియాతో మాట్లాడారు సాక్షి మాలిక్. మీడియా స‌మావేశం నుంచి సాక్షి మాలిక్ కంటతడి పెట్టుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.



Tags:    

Similar News