India Vs Srilanka : ఇక చాల్లే... బ్యాగులు సర్దుకుని వచ్చేయండి బాసూ

భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు

Update: 2024-08-08 03:46 GMT

వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్స్ వరకూ వచ్చిన టీం ఇండియా. టీ 20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీం ఇండియా శ్రీలంక చేతిలో దారుణ ఓటమి పాలు కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ లోనూ గెలవకుండా చేతులెత్తేశారంటే.. నిర్లక్ష్యమా? చేతకానితనమా? అన్న కామెంట్స్ జోరుగా వినపడుతున్నాయి. భారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్ లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక మ్యాచ్ టై అయింది. రెండు మ్యాచ్ లలో భారత్ ఓటమి పాలయింది. ఇలా ఎందుకు జరుగుతుందన్నది ఆటగాళ్లకే అర్థం కావడం లేదు. శ్రీలంక బౌలర్ల నైపుణ్యమా? లేక భారత్ బ్యాటర్ల వైఫల్యమా? అన్నది మాత్రం తేల్చాల్సి ఉంది.

మొదట బ్యాటింగ్ చేసి...
ఎప్పటిలాగా శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. 248 పరుగులు చేసిదంి. ఆవిష్క ఫెర్నాండో 956 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏడు వికెట్ల కోల్పోయి శ్రీలంక 248 పరుగులు చేసింది. కులాశ్ మెండీస్ 59 పరుగులు చేశాడు. భారత్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీశాడు. ఏడు వికెట్లు కోల్పోయినా శ్రీలంక అనుకున్న స్థాయిలోనే పరుగులు చేయగలిగింది. భారత్ గత రెండు మ్యాచ్ లలోనూ దాదాపు ఇంతే పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. అందుకే శ్రీలంక నింపాదిగా ఉంది. తక్కువ పరుగులకే భారత్ ను అవుట్ చేస్తామని భావించింది. అనుకున్నట్లుగానే జరిగింది.
వరసబెట్టి అవుటయి...
249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచే తడబాటు మొదలయింది. రోహిత్ శర్మ 35 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ టాప్ స్కోరర్. ఇక శుభమన్ గిల్, విరాట్ కొహ్లి, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇలా ఒక్కరేమిటి అందరూ చేతులెత్తేశారు. యాభై ఓవర్లు ఆడాల్సిన భారత్ 26.1 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 138 పరుగులు చేసి శ్రీలంకకు సిరీస్ ను అప్పజెప్పింది. 110 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే 1997 అనంతరం భారత్ పై శ్రీలంక వన్డే సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. స్పినర్ల దెబ్బకు భారత్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. భారత్ ఇంత దారుణ ఓటమిని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Tags:    

Similar News