పాకిస్థాన్ ను చిత్తు చిత్తు చేసిన భారత్

మన కుర్రాళ్లు మరోసారి అదరగొట్టేశారు. ACC ఎమర్జింగ్ టీమ్స్ పురుషుల ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ Aతో జరిగిన మ్యాచ్ లో భారత్ A జట్టు

Update: 2023-07-19 15:15 GMT

మన కుర్రాళ్లు మరోసారి అదరగొట్టేశారు. ACC ఎమర్జింగ్ టీమ్స్ పురుషుల ఆసియా కప్ 2023లో భారత్ A జట్టు పాకిస్థాన్ A ను చిత్తు చేసింది. యష్ ధుల్ నేతృత్వంలోని ఇండియా A జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. 36.4 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని చేరుకుంది భారత్. సాయి సుదర్శన్ 104 పరుగుల తేడాతో సెంచరీ సాధించాడు. 98 పరుగుల వద్ద సిక్స్ కొట్టి చిరకాల ప్రత్యర్థిపై సూపర్ సెంచరీ సాధించాడు. 110 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు సాయి సుదర్శన్. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 20 పరుగులు చేయగా, జోస్ 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ యష్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గ్రూప్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లలోనూ నెగ్గిన భారత్ సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జులై 21న తలపడనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడినప్పటికీ సెమీస్ కు అర్హత సాధించింది. ఆ జట్టు శ్రీలంకతో తలపడనుంది.

ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ కు ఏ దశలోనూ భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. హంగ్రేకర్ ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. పాక్ జట్టు తరపున ఖాసీం అక్రమ్ చేసిన 48 పరుగులే టాప్ స్కోర్. మిగిలిన పాక్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాక్.. టెయిలెండర్లు కాస్త పోరాడడంతో 205 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేజింగ్ లో పాక్ బౌలర్లు భారత్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ముబాసిర్ ఖాన్, మెహ్రాన్ ముంతాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. సెంచరీ చేసిన సాయి సుదర్శన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Tags:    

Similar News