India Champions vs Pakistan Champions ఛాంపియన్ గా నిలిచిన ఇండియా.. ఫైనల్ లో పాక్ చిత్తు!!
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్: శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు అర్ధ సెంచరీతో 30 బంతుల్లో 50 పరుగులు రాణించాడు. పాక్ బౌలర్లలో సోహైల్ తన్వీర్ మూడు వికెట్లు తీశాడు.
ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలింగ్ విభాగంలో అనురీత్ సింగ్ మూడు, వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ కు విజయం వరించింది. సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప విఫలమైనా.. అంబటి రాయుడు దూకుడైన ఇన్నింగ్స్ కు తోడుగా మిగిలిన వాళ్లు కూడా మంచి సహకారం అందించడంతో భారత్ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ లో చేధించగలిగింది. గురుకీరత్ సింగ్ మన్ 34, యువరాజ్ సింగ్ 15 నాటౌట్ చేశారు. ఆఖర్లో యూసుఫ్ పఠాన్ 16 బంతుల్లో 30 పరుగులు చేయడంతో భారత్ కు విజయం తొందరగానే చేరువైంది. 19.1 కి భారత్ లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్ గా నిలిచింది.