వరల్డ్ కప్ కు ముందు ఇదేందయ్యా?
భారత్ మూడో టీ 20 మ్యాచ్ లో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా ముందు నిలబడలేకపోయింది
భారత్ మూడో టీ 20 మ్యాచ్ లో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా ముందు నిలబడలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నిర్లక్ష్యమా? సిరీస్ గెలిచామన్న ధీమానో తెలియదు కానీ మ్యాచ్ చేజార్చుకుని స్వదేశీగడ్డపై క్లీన్ స్పీవ్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. 49 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. 2 -1 తో సిరీస్ ను భారత్ చేజిక్కించుకున్నప్పటికీ నిన్న జరిగిన మ్యాచ్ వరల్డ్ కప్ ముందు భారత్ క్రికెట్ అభిమానులను కలవరపెట్టే విధంగా ఉంది. ఒకరు అవుటయితే వరస పెట్టి క్యూ కట్టారు భారత్ బ్యాట్స్ మెన్స్.
తడబడిన....
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా పరుగుల సునామీని సృష్టించింది. భారత బౌలర్లను చీల్చి చెండాడారు. సిక్కులు, బౌండరీలతో చెడుగుడు ఆడుకున్నారు. 228 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచారు. రిలీ రూసో 48 పరుగులకు సెంచరీ చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలోనే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాన్ని జారవిడచుకున్నాడు. ఒకే ఒక్క పరుగు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయి వెనుదిరిగాడు. రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ కొంత పరుగులు కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. సూర్యకుమార్ ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు. వారు అవుటయిన తర్వాత భారత్ ఓటమి ఖాయమయింది. 18.3 ఓవర్లలో భారత్ ఆలౌట్ అయింది. 178 పరుగులు మాత్రమే చేసింది.