ఐదో టెస్ట్ లో భారత్ ఓటమి
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ లో భారత్ ఓటమి పాలయింది. దీంతో టెస్ట్ సిరీస్ ను ఇంగ్లండ్ సమం చేసింది.
భారత్ - ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ లో భారత్ ఓటమి పాలయింది. దీంతో టెస్ట్ సిరీస్ ను ఇంగ్లండ్ సమం చేసింది. 2 - 2 తో సిరీస్ ను ఇంగ్లండ్ సమం చేసింది. ఐదో టెస్ట్ లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారీ ఓటమి పాలయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, జానీ బెయిర్ స్టో చివరి వరకూ నిలబడి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించారు. ఇద్దరూ సెంచరీలు సాధించి ఇంగ్లండ్ సిరీస్ ను సమం చేశారు.
చివరి వరకూ నిలబడి...
జోరూట్ 142 పరుగులు, జానీ బెయిర్ స్టో 114 పరుగులు స్కోర్ చేశారు. గత ఏడాది కరోనా కారణంగా ఐదో టెస్ట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇండియా తొలి ఇన్నింగ్స్ 416 ఆలౌట్ అవ్వగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ తడబడింది. రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకే టీం ఇండియా ఆల్ అవుట్ అవ్వగా, ఇంగ్లండ్ 378 పరుగులు చేసి విజయం సాధించింది. సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంటుందన్న అంచనాలను జోరూట్, బెయిర్ స్టో తలకిందులు చేశారు. చివర వరకూ నిలబడి విజయాన్ని తమవైపునకు తిప్పుకున్నారు.