నేడే ఫైనల్.. భారత్ టైటిల్ కొట్టేనా..?

Update: 2022-10-15 01:40 GMT

మహిళల ఆసియా కప్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. శనివారం జరిగే ఫైనల్‌లో శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. ఏడవ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మీద ఆశలు పెట్టుకున్నా.. వారి కంటే మిగిలిన వాళ్లే అద్భుతంగా ఆడుతూ ఉండడంతో భారత్ టోర్నెమెంట్ ఫైనల్ కు చేరుకుంది. భారత మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ చాలా బాగా ఆడుతూ ఉండడం భారత్ కు కలిసొచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కేవలం నాలుగు గేమ్‌లు (81 పరుగులు) మాత్రమే ఆడింది. ఆ మ్యాచ్‌లలో మొత్తం 72 బంతులు మాత్రమే ఎదుర్కొంది. మూడు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన మందాన.. బ్యాట్ తో మాత్రం రాణించలేకపోతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు జెమీమా రోడ్రిగ్స్‌ 215 పరుగులతో అగ్రస్థానంలో నిలువగా.. షఫాలీ వర్మ 161 రన్స్‌ కొట్టింది. ఇక దీప్తి శర్మ బంతితో 13 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 94 పరుగులు చేసింది. ఈ టోర్నమెంట్ లో భారత్ కేవలం పాకిస్థాన్ చేతిలో మాత్రమే ఓడిపోయింది. సెమీ ఫైనల్ లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీని కొట్టి.. ఫైనల్ లో అడుగుపెట్టింది. శ్రీలంక జట్టు కూడా పలు ఇబ్బందులు పడుతోంది. స్టార్ క్రికెటర్ చమరి ఆటపట్టు 85 ప్లస్ స్ట్రైక్ రేట్ తో కేవలం 96 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ ఇనోకా రణవీర (12 వికెట్లు) మాత్రమే రాణించగలిగింది. మిగిలిన వాళ్ళల్లో అప్పుడప్పుడు రాణిస్తున్నారు. భారత్ కు ఫైనల్ లో షాక్ ఇవ్వాలంటే శ్రీలంక అద్భుతంగా రాణించాల్సిందే.

భారత మహిళలు- హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బిని మేఘన, రిచా ఘోష్ (వికెట్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ , రాధా యాదవ్, కె.పి. నవ్‌గిరే
రిజర్వ్ ఆటగాళ్లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్
శ్రీలంక మహిళలు- చమరి ఆటపట్టు (సి), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవీషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికె), కౌషిని నూత్యంగా, ఓషధి రణసింగ్, మల్షా షెహాని, మదుషిక మెత్తానంద, ఇనోకా రణవీర, రష్‌గన్ కుమారి కుమారి, అచ్చిని కులసూర్య, తారికా సెవ్వండి


Tags:    

Similar News