ప్రపంచ కప్ కు బయలుదేరిన టీమిండియా.. 15వ ఆటగాడు లేకుండానే..!

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా గురువారం

Update: 2022-10-06 02:35 GMT

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియా బయలుదేరింది. 2007 లో ఛాంపియన్ గా నిలిచిన భారత్.. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో సెమీ-ఫైనల్స్‌ కూడా చేరుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రపంచకప్ ను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉన్నారు. ప్రపంచ కప్‌కు ముందు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లను భారత్ ఓడించింది. అయితే బుమ్రా, జడేజా ప్రపంచ కప్ కు దూరమవ్వడం.. ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తూ ఉండడం భారతజట్టును, భారత అభిమానులను కలవరపెడుతూ ఉంది. బీసీసీఐ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం టీమ్ ఇండియా బృందం బయలుదేరుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. భారత జట్టు సభ్యులు తెల్లవారుజామున పెర్త్‌కు బయలుదేరిన సమయంలో తీసుకున్న చిత్రాలను పంచుకున్నారు. భారత్ కేవలం 14 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియాకు వెళ్లింది. జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని వచ్చే వారం ప్రకటించనున్నారు.

భారత టీ20 WC జట్టు: రోహిత్ శర్మ (సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.



Tags:    

Similar News