మహిళల ప్రపంచ కప్ మన దగ్గరే..!
వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లకు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది.
2024 నుండి 2027 వరకు, మహిళల క్రికెట్‌లోని నాలుగు ICC టోర్నమెంట్‌లలో మూడు భారత ఉపఖండంలో నిర్వహించనున్నారు. 2025లో వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులను భారత్ గెలుచుకుంది. ఇక 2024లో బంగ్లాదేశ్, 2026లో ఇంగ్లండ్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహించనున్నారు. శ్రీలంక కు కలిసొస్తే.. 2027లో టీ20 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వొచ్చు. పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హోస్ట్‌లను ఖరారు చేశామని, ప్రతి బిడ్‌ను క్లేర్ కానర్, సౌరవ్ గంగూలీ, రికీ స్కెరిట్‌లతో పాటు మార్టిన్ స్నెడెన్ అధ్యక్షతన బోర్డు సబ్-కమిటీ సమీక్షించిందని ICC తెలిపింది. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీలో భారత మాజీ ఆటగాడు వి.వి.ఎస్. లక్ష్మణ్‌కు చోటు దక్కింది. అతడితో పాటు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ, రోజర్ హార్పర్‌లు కూడా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
"మహిళల క్రికెట్ అభివృద్ధిని వేగవంతం చేయడం ICC యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతలలో ఒకటి. ఈ ఈవెంట్‌ల ద్వారా మరింత మంది ప్రజలలోకి తీసుకుని వెళ్లడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. క్రికెట్ ఒక బిలియన్ ప్లస్ అభిమానులతో దాని అనుబంధాన్ని మరింతగా పెంచుతుంది" అని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. ఇక వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లకు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్‌కు, ఆ తర్వాత 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ వేదిక కానుంది.