వన్డే ప్రపంచ కప్ 2023.. మారిన భారత్-పాక్ మ్యాచ్ డేట్
వన్డే ప్రపంచ కప్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 5 నుండి మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
వన్డే ప్రపంచ కప్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 5 నుండి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగనుంది. అయితే.. ఐసీసీ మొత్తం 9 మ్యాచ్‌ల తేదీలను రీషెడ్యూల్ చేసింది. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌తో సహా మొత్తం 9 మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చినట్టు ట్వీట్ చేసింది.
వన్డే ప్రపంచ కప్ కే హైలెట్‌గా భావించే ఇండో-పాక్ మెగా మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14వ తేదీకి మార్చారు. ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లాండ్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగాల్సి ఉంది. అది అక్టోబర్ 15న జరుగుతుంది. వీటితో పాటు హైదరాబాద్‌లో శ్రీలంక, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ను అక్టోబర్ 10కి షెడ్యూల్ చేసింది. లక్నోలో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా మ్యాచ్ అక్టోబర్ 12న జరుగుతుంది.
బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ మ్యాచ్ చెన్నైలో అక్టోబర్ 14న డే మ్యాచ్‌గా జరగాల్సి ఉండగా,.. ఈ మ్యాచ్ అక్టోబర్ 13న డే-నైట్ మ్యాచ్‌గా జరుగనుంది. నవంబర్ 12 నాటి డబుల్-హెడర్ మ్యాచ్‌లు.. నవంబర్ 11వ తేదీకి మార్చబడ్డాయి. ఉదయం 10:30 గంటలకు పుణెలో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుండగా.. ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోల్‌కతాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుంది. భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ నవంబర్ 11న జరగాల్సి ఉండగా.. అది ఇప్పుడు నవంబర్ 12న జరగనుంది.
ప్రపంచ కప్ 2023: ఈ 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు
అక్టోబర్ 10 - ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ మ్యాచ్
అక్టోబర్ 10 - పాకిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్
అక్టోబర్ 12 - ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్
అక్టోబర్ 13 - న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ మ్యాచ్
అక్టోబర్ 14 - భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్
అక్టోబర్ 15 - ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్
నవంబర్ 11 - ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మ్యాచ్
నవంబర్ 11 - ఇంగ్లండ్ vs పాకిస్తాన్ మ్యాచ్
నవంబర్ 12 - భారత్ vs నెదర్లాండ్స్ మ్యాచ్