ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా

Update: 2024-01-28 12:24 GMT

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకే కుప్పకూలింది. 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్తున్న భారతజట్టును కేఎస్ భరత్, అశ్విన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 8వ వికెట్ కు వీరిద్దరూ 57 పరుగులు జోడించారు. టామ్ హార్ట్లీ భరత్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ను విజయానికి మరింత దగ్గర చేశారు. భరత్ 59 బంతుల్లో 3 ఫోర్లతో భరత్ 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత అశ్విన్ స్టంపౌటయ్యాడు.

ఒక్క వికెట్ మాత్రమే ఉండడంతో అంపైర్లు నాలుగో రోజు మ్యాచ్ ను పొడిగించారు. చివరిలో సిరాజ్ అవుట్ అవ్వడంతో భారతజట్టు పోరాటం ముగిసింది. నాలుగో రోజు టీ విరామానికి 3 వికెట్లను 95 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్(17), రాహుల్(22), జడేజా(2), శ్రేయాస్ అయ్యర్(13) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. హార్ట్లీ 7 వికెట్లు తీసుకొని భారత పరాజయానికి కారణమయ్యాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న విశాఖపట్నంలో జరుగుతుంది.


Tags:    

Similar News