టాస్ గెలిచిన టీమిండియా.. భారత బ్యాట్స్మెన్ ను అవుట్ చేస్తే లక్ష
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ లాంటి పటిష్ట జట్టుపై
ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కాస్త కష్టమే..! అయినా కూడా నేపాల్ జట్టు ఆత్మవిశ్వాసంతో భారత్ ను ఢీకొట్టాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదని.. చివరి గేమ్‌లో బ్యాటింగ్ చేశాం.. బౌలర్లు ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలని అన్నాడు. వాతావరణం గురించి గురించి మేము పట్టించుకోవడం లేదని తెలిపాడు. ఇంతకు ముందు మ్యాచ్ లో ఒత్తిడిలో బ్యాటింగ్ చేసిన విధానం బాగుందని అన్నాడు. హార్దిక్, ఇషాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. ఇషాన్ చాలా పరిణతి కనబరిచి గేమ్‌ను కూడా ముందుకు తీసుకెళ్లాడన్నాడు. ఇలాంటివి మాకు మంచి సంకేతాలని రోహిత్ శర్మ తెలిపాడు. నేపాల్ తో మాకు మరో ముఖ్యమైన గేమ్. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో షమీని తీసుకున్నామని తెలిపాడు.