పాకిస్థాన్ కు ఘోర ఓటమి

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా.. పాకిస్థాన్‌పై భారత్‌

Update: 2023-10-14 14:57 GMT

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా.. పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అర్థశతకాలతో రోహిత్‌ శర్మ(86), శ్రేయస్‌ అయ్యర్‌(53) చెలరేగారు. ఎక్కడా కూడా పాక్ బౌలింగ్ లైనప్ భారత్ ను ఇబ్బందిపెట్టలేకపోయింది. రోహిత్ శర్మ మొదటి ఓవర్ నుండి బాదుతూ వచ్చాడు. ఆఖర్లో అయ్యర్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా రాహుల్ తో కలిసి మ్యాచ్ ను ముగించాడు. ఛేజింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి నుంచి దూకుడుగానే ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ 86, గిల్ 16, విరాట్ కోహ్లీ 16, శ్రేయాస్ అయ్యర్ 53, కేఎల్ రాహుల్ 19 పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 2, హసన్ అలీ ఒక వికెట్ తీశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. పాక్ జట్టులో బాబర్ అజామ్ అత్యధికంగా 50 పరుగులు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 49, ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ 36, అబ్దుల్లా షఫీక్ 20 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. కేవలం 36 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 7 వికెట్లు కోల్పోయిందంటే ఎంత చెత్తగా ఆడారో అర్థమవుతుంది.


Tags:    

Similar News