191 కి ఆలౌట్ అయిన పాకిస్థాన్
అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో
అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో పాకిస్థాన్ కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ లో బాబర్ ఆజమ్, రిజ్వాన్ లను మాత్రమే నమ్ముకున్న పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ 50 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రిజ్వాన్ 49 పరుగులు చేసి పెవిలియన్ బాట పడ్డాడు. ఆ తర్వాత ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కు తప్ప బౌలింగ్ వేసిన మిగిలిన ఐదుగురు బౌలర్లకు రెండేసి వికెట్లు పడ్డాయి. 2 వికెట్ల నష్టానికి 155 పరుగులతో ఒకానొక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన పాక్ జట్టు ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 42.5 ఓవర్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.