ఇండియా vs ఇంగ్లండ్.. కీలక మ్యాచ్ నేడు

ఇండియా సెమీ ఫైనల్స్ లో నేడు ఇంగ్లడ్ తో తలపడుతుంది. స్వల్ప మార్పులతో ఇండియా బరిలోకి దిగనుంది.

Update: 2022-11-10 02:10 GMT

ఇండియా సెమీ ఫైనల్స్ లో నేడు ఇంగ్లడ్ తో తలపడుతుంది. స్వల్ప మార్పులతో ఇండియా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు ముఖ్యమే. ఇది గెలిచిన జట్టు పాకిస్థాన్ తో జరిగే ఫైనల్ లో తలపడనుంది. భారత్ గ్రూప్ ఏలో నాలుగు మ్యాచ్ లతో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిది పాయింట్లు సాధించి ప్రపంచ కప్ లో ఏ జట్టుకు రాని పాయింట్లు భారత్ కు సంపాదించుకుంది.

తీసిపారేయడానికి...

ఇంగ్లండ్ కూడా తీసిపారేయడానికి లేదు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉంది. ముఖ్యమైన ప్లేయర్లు గాయాలపాలు కావడం కొంత ఇబ్బంది పడుతున్నా క్రికెట్ లో ఏం జరుగుతుందన్నది ముందే చెప్పలేం. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్ లో ఎన్నో సంచలనాలను చూశాం. చిన్న జట్లు అనుకున్నవి పెద్దజట్లను ఇంటికి పంపాయి. వెస్టిండీస్, సౌతాఫ్రికా వంటి జట్లు చిన్న జట్ల చేతిలో చిత్తయి పోయాయి. దీంతో నేడు జరిగే సెమీ ఫైనల్స్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశముంది.


Tags:    

Similar News