నేడు ఇంగ్లండ్ తో భారత్ తొలి వన్డే
నేడు ఇంగ్లండ్ తో భారత్ మొదటి వన్డే ఆడనుంది. వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని భారత్ ఉబలాటపడుతుంది
భారత్ - ఇంగ్లండ్ టూర్ లో చివరి సిరీస్ నేటి నుంచి మొదలు కానుంది. ఇంగ్లండ్ తో భారత్ టెస్ట్ సిరీస్ డ్రా కాగా, టీ 20 సిరీస్ ను 2 - 1 తో కైవసం చేసుకుంది. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. నేడు ఇంగ్లండ్ తో భారత్ మొదటి వన్డే ఆడనుంది. వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని భారత్ ఉబలాటపడుతుండగా, వన్డే సిరీస్ ను తమ సొంత గడ్డపై దక్కించుకోవాలన్న ఆరాటంలో ఇంగ్లండ్ జట్టు ఉంది.
భారత జట్టు ఇదే...
భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు మ్చాచ్ మొదలుకానుంది. ఇంగ్లండ్, భారత్ జట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వన్డే గేమ్ కు అనుగుణంగా తమ జట్ల కూర్పును చేసుకున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కొహ్లి, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ కృష్ణ, బూమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ లు వన్డే జట్టులో ఉన్నారు. కొహ్లికి గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కానున్నారని తెలిసింది.