India Women vs Bangladesh Women ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టిన భారత్
భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది
భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు చేసింది. ఛేజింగ్ లో భారత జట్టు ఏ మాత్రం తడబడలేదు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 11 ఓవర్లలో లక్ష్యానికి చేరుకుని ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది.
దంబుల్లాలో జరిగిన తొలి సెమీఫైనల్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఏ దశలో కూడా బంగ్లాదేశ్ జట్టు మంచి రన్ రేట్ ను మెయిన్టైన్ చేయలేకపోయింది. 7 పరుగులకు మొదటి వికెట్.. 33 పరుగులకు 5 వికెట్లు.. ఇలా బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. కెప్టెన్ నిగర్ సుల్తానా 32 పరుగులు చేయగా.. షోర్మా అఖ్తర్ 19 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా.. మిగతా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. రాధా యాదవ్, రేణుకా సింగ్ తలా మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను కుప్పకూల్చారు. ఇక ఛేజింగ్ లో భారత ఓపెనింగ్ జోడీ మరోసారి హిట్ అయింది. షిఫాలీ వర్మ 26 పరుగులు చేయగా.. స్మ్రితి మందాన హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించింది. వికెట్ పడకుండా లక్ష్యాన్ని చేధించింది భారత జట్టు. రేణుకా సింగ్ ఠాకూర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.