INDWvsSLW: ఆసియా కప్ ఫైనల్ లో భారత్ కు షాక్

ఆసియా కప్‌లో శ్రీలంక మహిళల జట్టు భారత్ కు షాక్

Update: 2024-07-28 13:36 GMT

ఆసియా కప్‌లో శ్రీలంక మహిళల జట్టు భారత్ కు షాక్ ఇచ్చింది. శ్రీలంక జట్టు అద్భుతమైన విజయం సాధించి తొలిసారి ట్రోఫీని గెలిచింది. భారత్‌తో జరిగిన ఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు కెప్టెన్‌ చమరి ఆటపట్టు (69) శుభారంభాన్ని ఇవ్వగా.. హర్షిత సమర విక్రమ (60), కవిషా దిల్హరి (30) సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను మలుపు తిప్పేశారు. భారీ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆరుసార్లు మహిళల ఆసియా కప్ ఫైనల్ కు చేరుకున్న శ్రీలంక జట్టు తొలిసారి టైటిల్ ను నెగ్గింది.

అంతకు ముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మతి మంధాన (60.. 47 బంతుల్లో 10 ఫోర్లు) సత్తా చాటింది. రిచా ఘోష్ 30 పరుగులు, జెమీమా 29 పరుగులతో రాణించారు. ఆఖర్లో భారత బ్యాటర్లు అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు.


Tags:    

Similar News