అరుదైన రికార్డు నమోదు చేసిన టీం ఇండియా
అహ్మదాబాద్ లో జరిగిన మూడు వన్డేల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ తో వన్డేల సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడు వన్డేల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ తో వన్డేల సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది. 3-0 తేడాతో వన్డే సిరీస్ ను చేజిక్కించుకుంది. మూడో వన్డేలో 96 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టును భారత్ మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 265 పరుగులు చేసింది. భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, శిఖర్ ధావన్ త్వరగానే పెవిలియన్ ముఖం పట్టారు.
క్లీన్ స్వీప్ చేసి....
శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ నిలదొక్కుకుని భారత్ కు పరుగుల వరద కురిపించారు. శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు, రిషబ్ పంత్ 56 పరుగులు చేసి భారత్ పరువును నిలబెట్టారు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వికెట్లను వరసగా చేజార్చుకుంది. స్మిత్ మినహా ఎవరూ పెద్దగా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. చివరకు 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ పై తొలిసారి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అరుదైన ఘనతను భారత్ సాధించింది.