పతకాల పట్టికలో భారత్‌ది నాలుగో స్థానం

ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు దేశం పేరును నిలుపుతున్నారు. బంగారు పతకాలను సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు

Update: 2023-10-03 02:15 GMT

ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు దేశం పేరును నిలుపుతున్నారు. ఎవరూ ఊహించన స్థాయిలో బంగారు పతకాలను సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకూ భారత్ పతకాల సంఖ్య అరవైకి చేరుకుంది. ఇందులో పదమూడు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 24 వెండి పతకాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచిందంటే భారత్ ఆటగాళ్లు తమ సత్తా ఎలా చాటు తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

పతకాల పండగ....
నిన్న జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు మూడు రజిత, ఒక కాంస్య పతకం లభించింది. లాంగ్ జంప్ లో భారత్ కు రజిత పథకం లభించింది.మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ చేజ్ లో భారత్ కు పతకాల పంట పండింది. దీంతో పాటు రోలర్ స్కేటింగ్‌లోనూ భారత్ క్రీడాకారులు రెండు పతకాలను సాధించారు. పురుషులు, మహిళలు మూడువేల మీటర్ల టీమ్ రిలే రెండింటిలోనూ భారత్ పతకాలను సాధించింది. టేబుల్ టెన్నిస్ లోనూ భారత్ అద్భుత ప్రదర్శన చేసి పతకాన్ని సాధించుకుంది.


Tags:    

Similar News