ఏందయ్యా ఇది ఇంత ఘోరంగానా?
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు. అతి తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ ను ఆల్ అవుట్ చేసేశారు.
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు. అతి తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ ను ఆల్ అవుట్ చేసేశారు. దీంతో భారత్ ముందు లక్ష్యం చాలా చిన్నది గా మారింది. రాయపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలి ఓవర్ లోనే మహ్మద్ షమి ఒక వికెట్ తీశాడు. తర్వాత ఓవర్ లో సిరాజ్ కూడా ఒక వికెట్ తీయడంతో పతనమయిన న్యూజిలాండ్ జట్టు అలాగే కొనసాగింది. కేవలం 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
లక్ష్యసాధనలో....
తర్వాత లక్ష్యసాధనలో భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓవర్ కు రన్ రేట్ తక్కువగా ఉండటంతో నింపాదిగా ఆడుతున్నారు. ఏడు ఓవర్లలో 29 పరుగులు చేసిన భారత్ వికెట్ కోల్పోలేదు. భారత్ బౌలర్లలో షమి మూడు, హార్దిక్ పాండ్యా రెండు, వాషింగ్టన్ సుందర్ రెండు, సిరాజ, శార్దూల్ ఠాకూర్, కులదీప్ యాదవ్ లు చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఆడుతున్నారు.