ఆసియా క్రీడల ఫైనల్ లో భారత క్రికెట్ జట్టు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు పతకం ఖాయమైనట్టే

Update: 2023-09-24 06:00 GMT

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు పతకం ఖాయమైనట్టే. సెమీఫైనల్స్-1లో భారత జట్టు బంగ్లాదేశ్‌ జట్టును చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 51 పరుగులకే కుప్పకూలింది. పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను కోలుకోనివ్వకుండా చేసింది. సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 5.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారతీయ టీంలో జెమీమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షెఫాలీ వర్మ (17) రాణించారు. సోమవారం జరిగే ఫైనల్‌లో శ్రీలంక లేదా పాకిస్థాన్‌తో భారత్ తలపడే అవకాశం ఉంది. ఫైనల్ లో భారత జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడితే గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడం కష్టమేమీ కాదు.


Tags:    

Similar News