చరిత్ర సృష్టించిన‌ మహిళల క్రికెట్ జట్టు.. ప్ర‌ధాని ప్ర‌శంస‌

IBSA వరల్డ్ గేమ్స్ 2023లో భారత మహిళల అంధుల మహిళా క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

Update: 2023-08-27 06:29 GMT

IBSA వరల్డ్ గేమ్స్ 2023లో భారత మహిళల అంధుల మహిళా క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గేమ్స్ లో తొలిసారిగా మహిళల క్రికెట్‌ను చేర్చారు. బంగారు పతకం సాధించిన భారత జట్టును ప్రధాని మోదీ అభినందించారు.

భారత మహిళల జట్టు కూడా ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది, అయితే వర్షం కారణంగా భారత జట్టు 42 పరుగుల లక్ష్యాన్ని 3.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిదానంగా కొనసాగించింది. భారత్ స‌రైన స‌మ‌యంలో వికెట్లు తీసి ఆస్ట్రేలియాను 20 ఓవర్లలో 114/8కి పరిమితం చేసింది. లక్ష్యాన్ని ఛేదన‌కు దిగిన భారత జట్టు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా 3.3 ఓవర్లలో 42 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.

అంధ భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. "IBSA వరల్డ్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించినందుకు భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు అభినందనలు! మన మహిళా క్రీడాకారుల తిరుగులేని స్ఫూర్తి, ప్రతిభకు ఉదాహరణగా నిలిచే చిరస్మరణీయ విజయం. భారతదేశం గర్విస్తోందని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News