లార్డ్స్ లో భారత్ దారుణ ఓటమి
ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి భారత్ బ్యాటర్లు తలవంచక తప్పలేదు. ఫలితంగా రెండో మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయింది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న సెకండ్ వన్డేలో భారత్ పేలవ ప్రదర్శన చూపింది. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి భారత్ బ్యాటర్లు తలవంచక తప్పలేదు. ఫలితంగా రెండో మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయింది. వంద పరుగుల తేడాతో పరాజయం పాలయింది. లార్డ్స్ లో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 246 పరుగులు చేసింది. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ అయింది.
వరుసగా పెవిలియన్ కు...
అనంతరం బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు పేలవ ప్రదర్శన చేశారు. జడేజా, హార్ధిక్ పాండ్యా తప్ప ఎవరూ పెద్దగా క్రీజులో నిలవలేక పోయారు. కొహ్లి కొద్దిసేపు ఫోర్లతో మురిపించిని 16 పరుగులకే క్యాచ్ ఇచ్చి వినుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నంత సేపు ఇండియా కొంత బలంగా కన్పించినా అవుట్ అయిన తర్వాత భారత్ ఓటమి ఖాయమయింది. దీంతో 1 - 1 సిరీస్ సమమయింది. ఆదివారం జరిగే మ్యాచ్ సిరీస్ లో ఎవరిది గెలుపు అనేది తేల్చనుంది.