నేడు ఇంగ్లండ్ - ఇండియా చివరి టెస్ట్
ఇంగ్లండ్ తో భారత్ ఐదో టెస్ట్ నేటి నుంచి జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ లో భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది
ఇంగ్లండ్ తో భారత్ ఐదో టెస్ట్ నేటి నుంచి జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ లో భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్ ను నిర్ణయించే కీలక పోరు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆట ప్రారంభం కానుంది.
పోరును తేల్చే...
కరోనా కారణంగా ఐదో టెస్ట్ మ్యాచ్ గతంలో వాయిదా పడింది. ఇప్పటికే భారత్ 2 - 1తో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ గడ్డపై చారిత్రాత్మక విజయం నమోదు చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది. కాగా సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తుంది. భారత్ జట్టుకు జన్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ కరోనా కారణంగా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు.