సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. ఆసీస్ చిత్తు

ఇండోర్ వేదికగా సాగిన వన్డే మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి

Update: 2023-09-24 16:47 GMT

ఇండోర్ వేదికగా సాగిన వన్డే మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ 2-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది భారత్. ఈ మ్యాచ్ లో కూడా వర్షం ఎంట్రీతో క్రికెట్ అభిమానులను చిరాకు పెట్టింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా లక్ష్యం 317గా నిర్ణయించారు. తొమ్మిది ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసిస్ రెండు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కురిసింది. దీంతో ఆసీస్ ముందు 317 టార్గెట్ ఉండగా.. 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. అబాట్ 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. వార్నర్ 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 99 పరుగులతో విజయాన్ని అందుకుంది. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. షమీకి ఒక వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(105) సెంచ‌రీలతో చెలరేగగా.. కేఎల్ రాహుల్(52), సూర్య కుమార్ యాదవ్(72) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. గిల్ 97 బంతుల్లో ఆరు సిక్సులతో 104 పరుగులు చేయగా, శ్రేయస్ 90 బంతుల్లో 3 సిక్సులతో 105 పరుగులు చేశాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ 38 బంతుల్లో 52 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులతో, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 31 పరుగులతో వేగంగా ఆడారు.


Tags:    

Similar News