ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్.. లైవ్ చూడాలంటే?
ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు ఇప్పటికే స్వర్ణం గెలవగా.. భారత మెన్స్ టీమ్ కూడా
ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు ఇప్పటికే స్వర్ణం గెలవగా.. భారత మెన్స్ టీమ్ కూడా గోల్డ్ వేటను మొదలుపెట్టనున్నది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా టీమ్ ఇండియా నేరుగా నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో భారత్ ఆసియా గేమ్స్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌తో టీమ్ ఇండియా పోటీపడనుంది. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆసియా క్రీడలకు బీసీసీఐ యువ క్రికెటర్లతో కూడిన జట్టును పంపించింది.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (సి), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్
IND vs NEP క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనున్నారు. భారత్, నేపాల్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ సోనీలివ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.