గాయంతో బాధపడుతున్నా.. భారత్ కు రానున్న కేన్ మామ
కేన్ విలియమ్సన్ జట్టు మెంటార్‌గా భారతదేశానికి రావచ్చు. అనుభవజ్ఞుడైన బ్యాటర్, కివీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ను మెంటార్..
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది చివర్లో భారత్ లో జరిగే ODI ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లేదు. అయితే గాయపడిన బ్యాటర్ భారత్ కు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. కేన్ విలియమ్సన్ జట్టు మెంటార్‌గా భారతదేశానికి రావచ్చు. అనుభవజ్ఞుడైన బ్యాటర్, కివీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ను మెంటార్ పాత్రలో ఉపయోగించేందుకు చూస్తానని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పాడు. విలియమ్సన్ కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అది విజయవంతమైంది. ఇప్పుడు పునరావాసంలో ఉన్నాడు. 32 ఏళ్ల విలియమ్సన్ గత నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే..!
బౌండరీ వద్ద సిక్సర్‌ను ఆపే ప్రయత్నంలో విలియమ్సన్ చేసిన జంప్ కారణంగా అతని మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ముందు కివీస్ కోచ్ స్టెడ్ మాట్లాడుతూ.. విలియమ్సన్ కోలుకుంటున్నాడని తెలిపాడు. ప్రపంచ కప్ లో ఆటగాడిగా అందుబాటులో లేకపోయినా మెంటర్ గా భారత్ లో జరిగే ప్రపంచ కప్ కు తీసుకుని వస్తామని స్టెడ్ తెలిపాడు. అతడి సూచనలు, సలహాలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకొచ్చాడు.