న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ ఎవరంటే?

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి

Update: 2024-10-12 05:50 GMT

Jasprit Bumrah

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అక్టోబర్ 17 న మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో గెలిచింది. ఆ జట్టునే సెలక్షన్ కమిటీ కొనసాగించింది. జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ పదవిని అప్పజెప్పారు.

వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆగస్టు 2023లో భారత జట్టులోకి తిరిగి వచ్చిన బుమ్రా అప్పటి నుండి అన్ని ఫార్మాట్‌లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 30 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 38 టెస్టుల్లో 20.18 సగటుతో 170 వికెట్లు పడగొట్టాడు. జూలై 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన ఐదవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బుమ్రారి భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), ధృవ్ జురెల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్

ట్రావెలింగ్ రిజర్వ్స్: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ


Tags:    

Similar News