టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టారు. టాస్ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ చిన్న సమస్య మాత్రమేనని చెప్పాడు. అయితే తర్వాతి రోజు భారత అభిమానులు షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా గాయంతో వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత దృష్ట్యా 4 వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఇటీవల యూఏఈలో మోకాలి గాయానికి గురైన రవీంద్ర జడేజా ఇప్పటికే వరల్డ్ కప్ కు దూరం కాగా, ఇప్పుడు బుమ్రా కూడా జట్టుకు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియాలో జరగనున్న ICC T20 ప్రపంచకప్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబరచాలంటే జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండాల్సిందేనని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. ఇప్పుడు వెన్నుపోటుతో టోర్నమెంట్‌కు దూరం కాబోతున్నాడని BCCI మూలాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ PTI నివేదించింది. బుధవారం తిరువనంతపురంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్ నుండి బుమ్రా వైదొలిగిన సంగతి తెలిసిందే. టాస్‌కు కొద్ది నిమిషాల ముందు బుమ్రా గాయపడిన విషయాన్ని బీసీసీఐ తెలియజేసింది. "మంగళవారం భారత ప్రాక్టీస్ సెషన్‌లో జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేశాడు. BCCI వైద్య బృందం అతనిని పరిశీలించింది. అతను మొదటి T20I నుండి తప్పుకున్నాడు" అని BCCI ట్వీట్ చేసింది. ఇప్పుడు ఏకంగా టీ20 ప్రపంచకప్ కే దూరమవ్వబోతున్నాడనే వార్తలు భారత అభిమానులను కలవరపెడుతున్నాయి.