Kamindu Mendis: రెండు చేతులతో బౌలింగ్ వేయడం చూసి భారత బ్యాట్స్మెన్ షాక్
కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ వేసి అందరినీ
పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. యువ స్పిన్నర్ అరుదైన బౌలింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. పదో ఓవర్‌లో బౌలింగ్ కు దిగిన కమిందు మెండిస్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎడమచేతి వాటం బౌలింగ్‌తో తన స్పెల్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రాగా కమిందు మెండిస్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ గా మారిపోయాడు. ఈ మ్యాచ్ లో ఒక ఓవర్ బౌలింగ్ వేసిన కమిందు మెండిస్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కమిందు మెండిస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు.. బౌలింగ్ మాత్రం రైట్ హ్యాండ్ తో వేస్తాడు. అందుకే రెండు హ్యాండ్ లతోనూ కమిందు మెండిస్ బౌలింగ్ వేయగలడు.
పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఒకానొక దశలో ఆ జట్టు స్కోరు 8 ఓవర్లకే 80 పరుగులు దాటింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక 79, కుశాల్ మెండిస్ 45 పరుగులతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. 14 ఓవర్లలో 140 పరుగులు చేసిన విజయం ఖాయం అన్నట్లుగా కనిపించింది. కానీ భారీ షాట్లకు ప్రయత్నించిన శ్రీలంక బ్యాటర్లు.. అనుభవం లేకపోవడంతో వరుసగా వికెట్లను సమర్పించేసుకున్నారు. చివరికి 19.2 ఓవర్లలో 170 పరుగులకు లంక ఆలౌట్ అయింది.