ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన అభిమానులకు షాకింగ్ విషయాన్ని చెప్పాడు. తాను ఆడబోయే ఆఖరి ప్రపంచకప్ ఖతార్ లోనే అని వెల్లడించాడు అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ. తన చివరి FIFA ప్రపంచ కప్‌ను 2022 ఖతార్‌లో ఆడనున్నానని గురువారం ధృవీకరించారు.ఏ ఫుట్‌బాల్ అభిమాని కూడా మెస్సీ తళుకులు ప్రపంచకప్ లో చూడలేమని అంటే అసలు ఒప్పుకోడు.
ఇప్పుడు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ తన ఆఖరి ప్రపంచ కప్ గురించి ధృవీకరించాడు. "ఇది నా చివరి ప్రపంచ కప్ అని ఖచ్చితంగా చెప్పగలను" అని మెస్సీ వెల్లడించాడు. "నేను శారీరకంగా బాగానే ఉన్నాను, ఈ సంవత్సరం చాలా మంచి ప్రీ-సీజన్ ఉంది. నేను ఆలస్యంగా శిక్షణ ప్రారంభించాను, నా ఆటలో రిథమ్ కనిపించడం లేదు. జాతీయ జట్టుకు తిరిగి వచ్చినప్పుడు నాకు గాయం ఉంది. నేను ప్రాక్టీస్ ను తిరిగి ప్రారంభించలేదు." అని చెప్పుకొచ్చారు. "నేను ప్రపంచకప్‌కు రోజులు లెక్కపెడుతున్నాను.. టోర్నమెంట్ గురించి చిన్న ఆత్రుత మాత్రమే. టోర్నమెంట్ లో ఏమి జరగబోతోందనే విషయం నాకు తెలియదు. అయితే ఈ ప్రపంచకప్ మాత్రం నా చివరిది." అని అన్నాడు మెస్సీ.
మెస్సీ FIFA ప్రపంచ కప్ వేదికపై పెద్దగా రాణించలేదు. అర్జెంటీనా స్టార్ ప్రపంచ కప్‌లో 19 మ్యాచ్‌లలో ఆరు గోల్స్ చేశాడు. నాలుగు ఎడిషన్లలో (2006, 2010, 2014, 2018) పాల్గొన్న స్టార్ ఖతార్ లో తన ప్రపంచ కప్ జర్నీ ముగించాలని అనుకుంటూ ఉన్నాడు. 2014 ప్రపంచ కప్ లో ఫైనల్ లో అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడిపోయింది. అర్జెంటీనా తన FIFA ప్రపంచ కప్ లో భాగంగా నవంబర్ 22 న సౌదీ అరేబియాతో మ్యాచ్ ఆడనుంది.