ధోనీనే గెలిచాడు.. ఆ ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోర్టు కేసులో

Update: 2023-12-15 12:08 GMT

dhoni madras high court

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోర్టు కేసులో గెలిచాడు. ధోని దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హై కోర్టు రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి జి సంపత్ కుమార్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేయడానికి అధికారికి సమయం ఇస్తూ.. శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. మ‌హేంద్ర సింగ్ ధోనీపై 10 సంవత్సరాల క్రితం బెట్టింగ్, స్పాట్‌ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు చేసిన సదరు ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష ప‌డింది. ధోనీ దాఖ‌లు చేసిన కోర్టు ధిక్కర‌ణ కేసును ద్విసభ్య ధ‌ర్మాస‌నం విచారించింది. కేసు పూర్వాప‌రాల‌ను నిశితంగా ప‌రిశీలించిన‌ జ‌స్టిస్ ఎస్ ఎస్ సుంద‌ర్, జ‌స్టిస్ సుంద‌ర్ మోహ‌న్‌లు సంప‌త్ కుమార్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌రించారు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని ఉన్న సమయంలో 2014లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినందుకు తమిళనాడు పోలీస్ సిఐడి విభాగంలో పనిచేస్తున్న సంపత్ కుమార్, ఒక టెలివిజన్ ఛానెల్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆ తర్వాత క్రికెటర్‌పై ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశాడు. సదరు అధికారి ఈ మేలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. పదవీ విరమణ చేశాడు. 2013 ఐపీఎల్ బెట్టింగ్ కేసులో సంపత్ కుమార్ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆ తర్వాత కొందరు బుకీల నుంచి లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించారు. అంతేకాకుండా ఆయన్ను సస్పెండ్ కూడా చేశారు.


Tags:    

Similar News