టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
భారత్, - ఇంగ్లండ్ ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది
భారత్, - ఇంగ్లండ్ ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది. ఇంగ్గండ్ ను కట్టడి చేయాలంటే భారీ స్కోరు నమోదు చేయాల్సి ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడితేనే భారత్ భారీ స్కోరు చేస్తుంది. ఈ నలుగురిలో ఇద్దరు బ్యాటర్లు కుదరుకున్నా భారీ స్కోరు ఇండియా సొంతమవుతుంది.
ఫామ్ లో ఉన్నా...
కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కొహ్లి ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ ఫామ్ లేమితో ఉన్నారు. నెదర్లాండ్ మ్యాచ్ లో తప్పించి రోహిత్ అర్ధసెంచరీ ఏ మ్యాచ్ లోనూ చేయలేకపోయారు. ఇక అక్షరపటేల్ కూడా బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా వేస్తే కొంత ఇంగ్లండ్ ను కట్టడి చేసే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ ను అంత తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. అందుకే బ్యాటర్ల మీద ఎక్కువ వత్తిడి ఉండనుంది.