IPL 2025 : నేడు మరో బిగ్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది;

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ముంబయి జట్టు వరస ఓటములతో కుంగిపోయి ఉంది. తన సొంత మైదానంలోనైనా ముంబయి తేరుకుని విజయం సాధించాలన్న కితో ఉంది. రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ చివర బంతి వరకూ ఉత్కంఠ రేపుతుందా? లేక వన్ సైడ్ గా ముగుస్తుందా? అన్నది చూడాలి.
ఎవరిదో గెలుపు...?
అయితే గత సీజన్ లో దుమ్ము రేపిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా ఈ సీజన్ లో పెద్దగా ఆశించిన మేరకు రాణించడం లేదు. అయితే ఎప్పుడైనా ఆ జట్టు పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇరుజట్లు బలాబలాలను పరిశీలిస్తే సమానంగానే ఉండటంతో ఈ మ్యాచ్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.