IPL 2025 : నేడు మరో సూపర్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. కోల్ కత్తానైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది;

నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. కోల్ కత్తానైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. కోల్ కత్తాలో రాత్రి 7.30 గంటలకు ీ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు విజయాలు, అపజయాలు ఇలా పడుతూ లేస్తూ ఇప్పటి వరకూ ఐపీఎల్ సీజన్ లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
రెండు జట్లు...
కోల్ కత్తానైట్ రైడర్స్ మూడు మ్యాచ్ లు ఇంత వరకూ ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి రెండు మ్యాచ్ లో ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అంతే. మూడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం నిరీక్షిస్తున్నాయి. రెండు బలమైన జట్లు కావడంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగే అవకాశముందన్న అంచనాలున్నాయి.