IPL 2025 : నేడు సండే స్పెషల్... రెండు సూపర్ మ్యాచ్ లు
ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో నేడు రెండు సూపర్ మ్యాచ్ లు జరగనున్నాయి;

ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో నేడు రెండు సూపర్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి ఆదివారం ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరుపుతుంటారు. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఆద్యంతం అలరించే అవకాశముంది. ఇరుజట్లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ రెండు జట్లు చెరో మ్యాచ్ లో గెలిచాయి.
రెండో మ్యాచ్ లో...
రెండో మ్యాచ్ గౌహతిలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయి ఉంది. దీంతో ఈ మ్యాచ్ రాయల్స్ కు కీలకం. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒక మ్యాచ్ లో గెలిచి మరొక మ్యాచ్ లో ఓటమి పాలయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. రాయల్స్ కూడా ఏ మాత్రం తగ్గేటట్లు కనిపించడం లేదు. సో.. సండే రోజు క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్యాహ్నం మొదలయిన పండగ రాత్రి వరకూ కొనసాగనుంది.