IPL 2025 : చెన్నైకు వరస ఓటమి... రాయల్స్ దే ఈ మ్యాచ్
గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.;

ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి విజయాన్ని దక్కించుకుంది. వరసగా రెండు ఓటములను చవి చూసిన రాయల్స్ చివరకు గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. బ్యాటర్లు నితీష్ రాణా, బంతితో హసరంగ తమ సత్తా చూపడంతోనే ఈ విజయం సాధ్యమయింది. చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం రెండో పరాజయం తప్పలేదు. కేవలం ఆరు పరుగుల తేడాతోనేవిజయం సాధించినా మంచి ప్రతిభను కనపర్చినట్లయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ లో నితీష్ రాణా చెలరేగి ఆడటంతో ఎక్కువ పరుగులు సాధించింది. నితీష్ రాణా 81 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సికర్సర్లు, పది ఫోర్లు ఉండటం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసి...
రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్లకు 182 పరుగులు చేసింది. ఇందులో యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్ విఫలమయినప్పటికీ నితీష్ రాణా, రియాన్ పరాగ్ లు ఆడటంతో కొంత ఆ మాత్రం స్కోరు లభించింది. హెట్ మేయర్ చివరిలో కొంత బ్యాట్ ను ఝులిపించినా ఫలితం లేదు. కేవలం 19 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ ఆశించినంతగా ఆడలేదు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, పతిరానా రెండు, జడేజా ఒకటి, నూర్ అహ్మద్ రెండు, ఒవర్ధన్ రెండు వికెట్లు తీసుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగింది. ఐపీఎల్ లో 182 పరుగులు పెద్ద టార్గెట్ కాదు
టార్గెట్ తక్కువయినా...
అయితే తర్వాత బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు నిరాశ పర్చారు. ఓపెనర్లు గా వచ్చిన రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. త్రిపాఠి 23 పరగుుల చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 63 పరుగులు చేశాడు. శివమ్ దూబె పద్దెనిమిది పరుగులకే అవుటయ్యాడు. విజయ్ శంకర్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో మొన్న బెంగలూరు మ్యాచ్ తరహాలోనే విజయాన్ని దక్కించుకునే అవకాశం సీనియర్ ఆటగాళ్లు జడేజా, ధోనీపై పడింది. అయితే జడేజా నాటౌట్ గా నిలిచి 32 పరుగులు చేశాడు. ధోని పదహారు పరుగులు చేసి అవుట్ కావడంతో కేవలం 176 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ముగించాల్సి వచ్చింది. వరసగా రెండో పరాజయాన్ని చెన్నై మూటగట్టుకుంది.