IPL 2025 : నేడు సమ ఉజ్జీల పోరు
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది.;

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. లక్నోలో జరగనున్న ఈమ్యాచ్ రెండు జట్లు కీలకంగా నే చూడాలి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లక్నో మూడు మ్యాచ్ లు ఆడి రెండు ఓటమి పాలయి ఒక మ్యాచ్ లో గెలిచింది. ముంబయి కూడా మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో ఓటమి పాలయి ఒకదానిలో మాత్రమే గెలిచింది.
ఇరు జట్లు...
అంటే రెండు జట్లు సమాన బలంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలుపు రెండు జట్లకూ అవసరమే. అందుకే ఇరు జట్లు మైదానంలో ఢీ అంటే ఢీ అని తలపడే ఛాన్స్ ఉంది. ముంబయి ఇండియన్స్ ఓటమి నుంచి తేరుకుని గెలుపు బాట పట్టింది. అయితే ఆత్మవిశ్వాసంతో ఉన్న ముంబయిని లక్నో ఏ రకంగా నిలువరిస్తుందన్నది చూడాలి.