Neeraj Chopra : నీరజ్ చోప్రాకు రజతం.. తృటిలో మిస్ అయిన స్వర్ణం
ఒలింపిక్స్ లో జావెలెన్ త్రో లో నీరజ్ చోప్రాకు రజత పతకం వచ్చింది.
ఒలింపిక్స్ లో జావెలెన్ త్రో లో నీరజ్ చోప్రాకు రజత పతకం వచ్చింది. గత ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి రజితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నీరజ్ చోప్రా ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తారని అనుకున్నారంతా. అయితే బ్యాడ్‌లక్ రజత పతకంతోనే ఆయన సర్దుకోవాల్సి వచ్చింది. తనకు ప్రధాన అథ్లెట్లను మించి 89.45 మీటర్ల దూరం బల్లేన్ని విసిరాడు. కానీ ఊహించని విధంగా పాకిస్థాన్ కు చెందిన అర్హద్ నదీమ్ 92.97 మీటర్ల దూరంతో బల్లెం విసిరడంతో నీరజ్ కు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వరస పతకాలతో...
అయితే రజత పతకం సాధించడం కూడా చాలా అరుదైన విషయం. గత ఒలింపిక్స్ లో సర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా ఈసారి మాత్రం రజత పతకాన్ని సాధించాడు. వరసగా పతకాలను సాధించి భారత్ కీర్తిని మరింత ఇనుమడింప చేశారు. నీరజ్ చోప్రాకు జావెలెన్ త్రోలో రజత పతకం రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభినందనలు తెలిపారు. నీరజ్ చోప్రా మరో ఒలింపిక్ మెడల్ భారత్ కు దక్కేలా చేశాడని, అతడిని చూసి అందరూ గర్వించాలని మోదీ పేర్కొన్నారు.