భారత్ లక్ష్యం 161 పరుగులు
మూడో టీ 20లో భారత్ ఎదుట భారీ పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది. 160 పరుగులకు న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది
మూడో టీ 20లో భారత్ ఎదుట భారీ పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది. 160 పరుగులకు న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లను కొద్దిగా కట్టడి చేసినట్లే భారత బౌలర్లు కన్పించినా, న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 161 పరుగులు చేయాల్సి ఉంది. బౌలర్లు ఇద్దరు చెరి నాలుగు వికెట్లు తీశారు.
ఇద్దరు బౌలర్లు...
భారత బౌలర్లలో అర్షదీప్ నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను దెబ్బతీశాడు. సిరాజ్ కూడా నాలుగు వికెక్టుల తీశాడు. 19వ ఓవర్ లో మూడు వికెట్లు వరసగా పడటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. హర్షల్ పటేల్ చివరి ఓవర్ లో ఒక వికెట్ తీసి న్యూజిలాండ్ ను ఆలౌట్ చేశాడు. మొత్తం మీద భారత బ్యాటర్లపై ఇప్పుడు భారం పడింది. 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.