కోహ్లీ అడిగాడని నో బాల్ ఇచ్చేశారు

Update: 2022-10-24 01:36 GMT

భారత్- పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో విజయం భారత్ ను వరించింది. అయితే రెండు నిర్ణయాల పట్ల పాకిస్థాన్ అభిమానులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాకిస్థాన్‌ల మధ్య MCGలో జరిగిన T20 ప్రపంచ కప్ గేమ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించడానికి విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కోహ్లీ 53 బంతుల్లో 83 పరుగులు చేశాడు, పాకిస్తాన్ ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఇక మ్యాచ్ లో హై డ్రామా నెలకొంది. ఆఖరి ఓవర్‌లో పాక్‌ ఆటగాడు మహ్మద్‌ నవాజ్‌ వేసిన బంతిని కోహ్లీ నోబాల్‌ అడగడం కూడా వివాదాస్పదం అయింది.

3 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా, నవాజ్ వేసిన ఫుల్-టాస్ స్క్వేర్ లెగ్‌పై సిక్సర్ కొట్టాడు కోహ్లీ. అయితే అది నో బాల్ అని డిమాండ్ చేశాడు కోహ్లీ. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్లు చర్చించి అది నో-బాల్ అని చెప్పారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ సూపర్ 4 విజయాన్ని అందించిన హీరో నవాజ్ ఆఖరి ఓవర్ లో భారత్ కు ఇవ్వాల్సిన రన్స్ ను ఇచ్చేశాడు. పాక్ అభిమానులు 'మోసం' జరిగిందని ఆరోపిస్తూ అంపైర్ల నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ అంపైర్‌లను కోరినందున అంపైర్ నో-బాల్ ఇచ్చాడని చెబుతున్నారు. కోహ్లీ ఆ సమయంలో క్రీజ్ లో లేడని.. అయినా కూడా నో బాల్ ఎలా ఇస్తారంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా, పాక్ స్పిన్నర్ నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. కోహ్లీ సిక్సర్ గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించగా, కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కానీ బంతి ఫీల్డర్ల నుంచి దూరంగా వెళ్లడంతో కోహ్లీ, కార్తీక్ మూడు పరుగులు తీయడంతో చివర్లో రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. కార్తీక్ అవుట్ కావడంతో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు. నవాజ్ ఓ వైడ్ వేశాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా, అశ్విన్ ఓ లాఫ్టెడ్ డ్రైవ్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు.


Tags:    

Similar News