శుభమన్ గిల్ సూపర్ సెంచరీ

భారత్ - న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు నిలకడగానే ఆడుతున్నారు. శుభమన్ గిల్ సెంచరీని చేశాడు

Update: 2023-01-18 11:13 GMT

భారత్ - న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఆశాజనకంగానే ఆడుతున్నారు. శుభమన్ గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 87 బాల్స్ లో పథ్నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో శుభమన్ గిల్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో గిల్ కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఇంకా క్రీజ్ లోనే ఉన్నాడు. 117 బంతులు ఆడి 140 పరుగులు చేసిన శుభమన్ గిల్ ను అవుట్ చేసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు చేసిన యత్నాలన్నీ విఫలమవుతనే ఉణ్నాయి.

ప్రస్తుతం స్కోరు...
ప్రస్తుతం ఐదు వికెట్లు కోల్పోయి భారత్ 257 పరుగులు భారత్ చేసింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ భాగస్వామ్యం చాలా సేపు కొనసాగడంతో భారత్ భారీ స్కోరు దిశగా వెళుతుంది. రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 37, హార్థిక్ పటేల్ 28 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. ఇంకా ఎనిమిది ఓవర్లు ఉండటంతో టీం ఇండియా మూడు వందల పరుగులు చేసే అవకాశముంది.


Tags:    

Similar News