IND vs PAK: అసలు మజా.. ఈరోజే!

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు

Update: 2024-07-13 06:07 GMT

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు క్రీడ ఏదైనా సరే టీవీలకు అతుక్కుపోతారు. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే ఇక సందడే సందడి. లెజెండ్స్ లీగ్ ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ జట్లు నేడు తలపడనున్నాయి. సెమీ ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియాను, వెస్టిండీస్ ను పాకిస్థాన్ జట్టు ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టాయి.

తొలి సెమీస్‌లో పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది.
ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రాబిన్ ఉతప్ప(65), యూసఫ్ పఠాన్‌(51), యువరాజ్ సింగ్‌(59), ఇర్ఫాన్ పఠాన్(50) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది.
శనివారం రాత్రి 9 గంటలకు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్ హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
భారత ఛాంపియన్స్ జట్టు: రాబిన్ ఉతప్ప(w), అంబటి రాయుడు, సురేష్ రైనా, యువరాజ్ సింగ్(c), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, గురుకీరత్ సింగ్ మాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ధవల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, RP సింగ్, నమన్ ఓజా, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, రాహుల్ శర్మ
పాకిస్థాన్ ఛాంపియన్స్ స్క్వాడ్: కమ్రాన్ అక్మల్(w), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్(c), షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, అమీర్ యామిన్, సొహైల్ తన్వీర్, వాహబ్ రియాజ్, సోహైల్ ఖాన్, అబ్దుల్ రజాక్, తౌఫీక్ ఉమర్, మహ్మద్ హఫీజ్, యాసిర్ అరాఫత్, సయీద్ అజ్మల్, ఉమర్ అక్మల్, తన్వీర్ అహ్మద్


Tags:    

Similar News