భారీ స్కోరు చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న టీమిండియా
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. మొదట తడబడిన భారత జట్టు.. ఇషాన్ కిషన్(82), హార్ధిక్ పాండ్యా(87) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు దక్కించుకుంది. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడంతో భారత్ 300 పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయింది.
సెంచరీ దిశగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషాన్.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వెంట వెంటనే ఔట్ కావడంతో టీం ఇండియా కష్టాల్లో పడింది. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.