నేటితో ముగియనున్న ఒలింపిక్స్ ... వినేష్ ఫొగట్ కేసు మాత్రం?

నేటితో పారిస్ ఒలింపిక్స్ ముగియనుంది. రాత్రి 12.30 గంటలకు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Update: 2024-08-11 03:44 GMT

నేటితో పారిస్ ఒలింపిక్స్ ముగియనుంది. రాత్రి 12.30 గంటలకు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ ఖాతాలో ఇప్పటి వరకూ ఆరు పతకాలు వచ్చాయి. అయితే ఈరోజు వినేష్ ఫోగట్ అంశంపై న్యాయస్థానం తీర్పు ఇచ్చే అవకాశముంది. వినేశ్ ఫోగట్ భారత్ రెజ్లర్ పై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

తీర్పును ఎల్లుండికి ...
ఫైనల్ పోరులో వంద గ్రాముల బరువు ఉందని ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో వినేష్ ఫోగట్ పారిస్ లోని స్పోర్ట్స్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న స్పోర్ట్స్ కోర్టు ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. ఎల్లుండి తీర్పు రానుంది. దీంతో వినేష్ ఫోగట్ కు సిల్వర్ మెడల్ వస్తుందా? లేదా? అన్నది ఎల్లుండి తేలనుంది.


Tags:    

Similar News