వన్డే మ్యాచ్‌లో భారీ 'డబుల్ సెంచరీ' చేసిన పృథ్వీ షా..!
ఇంగ్లండ్‌లో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రెచ్చిపోయాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా
ఇంగ్లండ్‌లో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రెచ్చిపోయాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లీష్ టోర్నమెంట్ రాయల్ లండన్ వన్డే కప్ 2023లో షా డబుల్ సెంచరీ చేయడం ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. పృథ్వీ షా 153 బంతుల్లో 244 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా 28 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్ షా కావడం విశేషం. అయితే.. లండన్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. పృథ్వీ షాపై బ్యాటింగ్, వివాదాల గురించి చాలా చర్చ జరుగుతోంది. మంచి నైపుణ్యమున్న ఆటగాడిగా పేరున్న పృథ్వీ షా వివాదాలేంటో చూద్దాం..
పృథ్వీ షా తరచూ ముంబైలో పార్టీలకు వెళ్తుంటాడు. ఫిబ్రవరిలో ఒక పార్టీ సందర్భంగా పృథ్వీ షా ముంబైలో ఒక మోడల్‌తో సెల్ఫీ వివాదంలో చిక్కుకున్నాడు. పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి శాంటాక్రూజ్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో డిన్నర్ కోసం వెళ్ళాడు, సప్నా గిల్ అనే మోడల్ తన స్నేహితుడితో వచ్చి సెల్ఫీ అడిగింది. అందుకు పృథ్వీ షా నిరాకరించాడు. హోటల్ మేనేజర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన యాజమాన్యం హోటల్ నుంచి వారిని వెళ్లిపోవాలని కోరింది. షా, అతని స్నేహితులు హోటల్ నుంచి వెళ్తుండగా.. హోటల్ బయట ఉన్న పలువురు వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్లతో వారి కారును ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకున్నారు.
పృథ్వీ షా దగ్గు సిరప్ వివాదంలో చిక్కుకున్నాడు. 22 ఫిబ్రవరి 2019న ఇండోర్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచ్ సందర్భంగా.. బీసీసీఐ డోపింగ్ టెస్ట్ క్యాంప్ నిర్వహించింది. పరీక్ష తర్వాత షా నమూనాలో టెర్బుటలైన్ వాడినట్లు తేలింది. డోపింగ్ నేరం కారణంగా షా 15 నవంబర్ 2019 వరకు సస్పెండ్ అయ్యాడు. అయితే.. పృథ్వీ షా పొరపాటున దగ్గు సిరప్‌లో నిషేధిత ఔషధాన్ని తీసుకున్నాడని బీసీసీఐ గుర్తించింది. దీంతో స్వల్ప కాలం అంటే 8 నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.
2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన యో-యో టెస్టులో పృథ్వీ షా విఫలమయ్యాడు. ఐపీఎల్‌కు ముందు కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ వారు తగినంత ఫిట్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇది తప్పనిసరి పరీక్ష. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన షా అలసిపోయినట్లు కనిపించాడు. దీంతో యో-యో పరీక్షలో PTI స్కోర్ 15 కంటే తక్కువ స్కోర్ వచ్చింది. పురుషుల ఫిట్‌నెస్ మార్కు 16.5గా ఉంటుంది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచాడు పృథ్వీ షా. అయితే ఎప్పటినుంచో మంచి ఇన్నింగ్సు కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా.. తాజా డబుల్ సెంచరీతో సమాధానమిచ్చాడు.