సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధు
సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధు
సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు నిలిచింది. ఈ ఏడాది సింధు మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. 21-09, 11-21, 21-15 తేడాతో ఫైనల్ లో చైనాకు చెందిన వాంగ్ జీని సింధు ఓడించింది. మొదటి గేమ్ లో సింధు ముందు వాంగ్ జీ ఏ మాత్రం నిలవలేకపోయింది. రెండో గేమ్ లో మాత్రం వాంగ్ జీ సింధుకు చుక్కలు చూపించింది. పాయింట్ సంపాదించుకోడానికే సింధు చాలా కష్టపడింది. పుంజుకునే సమయానికి సెకండ్ గేమ్ ను వాంగ్ జీ సొంతం చేసుకుంది. ఇక ఛాంపియన్ షిప్ నిర్ణయాత్మక మూడో గేమ్ లో సింధు దూకుడు కనబరిచింది. వాంగ్ జీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-15 తో టైటిల్ ను సొంతం చేసుకుంది సింధు.
సింధు 2022లో ఇండోనేషియా ఓపెన్‌లో మొదటి రౌండ్ ఓటమి మరియు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మరియు జర్మన్ ఓపెన్‌లలో రెండు రెండో రౌండ్‌లో ఓడిపోయింది. ఆమె ఇండోనేషియా మాస్టర్స్, మలేషియా ఓపెన్, మలేషియా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకుంది మరియు కొరియా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లలో సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్‌లలో సింధు టైటిల్స్‌ను గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సింగపూర్ ఓపెన్ ను కూడా సింధు సొంతం చేసుకుంది.